![]() |
| Home Group |
1. Home Network
2. Work Network
3. Public Network
దీనిలో Work Network అంటే మీ యొక్క కంప్యూటర్ ని డొమైన్ (Domain) లో కనుక జతపరచాలి అంటే ఇది ఎంపిక చేసుకోవలిసి ఉంటుంది. ఇందులో మీ కంప్యూటర్ యొక్క పరిధి అనేది ఆయా యుసేర్ లకు డొమైన్ లో ఇచ్చిన అనుమతి ని బట్టి ఉంటుంది అంతే కాని మీరు లోకల్ మీ కంప్యూటర్ లో చేయడానికి అంటూ ఏమి ఉండదు.
ఇక Public Network కు కనుక వస్తే మీరు కేవలం ఒకే సిస్టం కనుక ఉపయోగిస్తూ మీ కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే ఇది ఉపయోగకరం గా ఉంటుంది. దీనివల్ల మీరు ISP నెట్వర్క్ లో ఒక మెంబెర్ అయిన కూడా మీ యొక్క డేటా అనేది సురక్షితంగా ఉంటుంది.
ఇక చివరిగా Home Network గురించి చెప్పుకోవాలి అంటే మీ ఇంట్లో లేదా మీ ఆఫీసు లో పిసి, రెండు లాప్ టాప్ లు, ప్రింటర్ ఇలా ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్ మీ నెట్వర్క్ లో ఉన్నపుడు ఏది చాలా ఉపయోగకరం గా ఉంటుంది. ఎందుకంటే మీ డేటా ని కాని లేదా నెట్వర్క్ Device ని గాని షేర్ చేసుకోవాలి అంటే అన్ని ఒకే హోమ్ గ్రూప్ లో కనెక్ట్ అయి ఉంటే సరిపోతుంది. ఒక వేళ మీ నెట్వర్క్ ఇంతకు ముందే కనుక హోమ్ గ్రూప్ లో కనుక చేర్చబడి ఉంటే మీ యొక్క కొత్త Device ని లేదా సిస్టం ని ఆ హోమ్ గ్రూప్ లో జాయిన్ (Join) చేస్తే సరిపోతుంది అది ఎలా అనేది ఎపుడు తెలుసుకుందాం. మరిముఖ్యంగా హోమ్ గ్రూప్ Password Protect చేయబడి ఉంటుంది కాబట్టి మీరు ఆ గ్రూప్ లోకి వెళ్ళాలి అంటే కనుక కచ్చితంగా ఆ పాస్ వర్డ్ తెలిసి ఉండాలి. దీనివలన ఉపయోగం ఏమిటి అంటే మీకు కావలిసిన కంప్యూటర్ ని మాత్రమే హోమ్ గ్రూప్ లోకి చేరిస్తే డేటా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఇతర కంప్యూటర్ లు జాయిన్ అయితే వాటికీ మనం పంచుకున్న ఫోల్డర్లు Access అవుతాయి.
కొత్త హోమ్ గ్రూప్ Create చేయడం ఎలా..?
మీరు మొదటి సారి నెట్వర్క్ Configure చేయగానే ఈ విండో వస్తుంది, లేదంటే ఇంతకు ముందే Configure చేసిన నెట్వర్క్ లోనే మర్పుచేయాలి అంటే ఈ కింది విదంగా వెళితే ఈ విండో వస్తుంది.
ఇప్పుడు Open Netwok and Sharing Center క్లిక్ చేయండి.
ఈ చిత్రం లో కనిపిస్తున్న విదంగా Public Network మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విండో ఓపెన్ అవుతుంది.
పైన కనిపిస్తున్న విండో లో Home Network ని ఎంపిక చేసుకోండి.
మీరు ఇచ్చిన కంప్యూటర్ పేరుతోనే హోమ్ గ్రూప్ Create చేయబడుతుంది.
ఈ విండో లో హొమ్ గ్రూప్ లో షేర్ చేయదలుచుకున్న సిస్టం ఫోల్దేర్స్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి.
ఎప్పుడు హోమ్ గ్రూప్ create చేయబడింది విండోస్ Default గా ఒక హోమ్ గ్రూప్ పాస్ వర్ద్ ఇస్తుంది ఇది తరువాత ఎప్పుడు అయిన మార్పు చేసుకోవచ్చు లేదా దానినే కొనసాగించవచ్చు.
ఇప్పుడు హొమ్ గ్రూప్ create చేయబడటం మీరు గమనించ వచ్చు.
ఒకవేళ కనుక మీ నెట్వర్క్ హోమ్ గ్రూప్ లో ఉండి మీ కంప్యూటర్ ని జత పరచవలసి వస్తే Home Network మీద క్లిక్ చేయగానే మీ నెట్వర్క్ ఉన్న హోమ్ గ్రూప్ గుర్తించి పాస్ వర్డ్ మాత్రం అడుగుతుంది అది ఇవ్వగానే మీరు హొమ్ గ్రూప్ లోకి వెళ్ళగలుగుతారు.
ఇకపై Windows Explorer లో హార్డ్ డిస్క్ లోని ఇతర డ్రైవ్ లు మాదిరి గానే ఎడమచేతి వైపు Home Group అనే విభాగం క్రింద ఆ గ్రూప్ లోని ఉన్న వివిధ కంప్యూటర్ లు యొక్క పేర్లతో, అవి పంచుకున్న ఫోల్డర్లు పేర్లు కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ ని నేరుగా మీ కంప్యూటర్లో ఓపన్ చేసుకోవచ్చు. Home Group and Sharing Option ద్వారా ప్రింటర్లు షేర్ చేసుకోవచ్చు.
హోమ్ గ్రూప్ సెట్టింగ్స్ మార్చు కోవాలి అంటే Network Sharing center లో హోమ్ గ్రూప్ మీద క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మీ హోమ్ గ్రూప్ పాస్ వర్డ్ కూడా మార్పు చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉంటే మీ అభిప్రాయం నాతో పంచుకోండి అది నాకు ఎంతో ప్రోత్శాహ కరంగా ఉంటుందని ఆశిస్తూ....







