Q & A



ఇన్ స్టాల్ చేసిన సాఫ్ట్ వేర్ వేరే కంప్యూటర్ లో కాపి చేయవచ్చా?

నా కంప్యూటర్ లో ఇప్పటికే ఇన్ స్టాల్ చేయబడి ఉన్న కొన్ని సాఫ్ట్ వేర్ లు వేరే కంప్యూటర్ లోకి మళ్ళి ఇన్ స్టాల్ చేయలిసిన అవసరం లేకుండా నా కంప్యూటర్ నుండి కాపీ చేసుకుని వేరే కంప్యూటర్ లో నా పాత సెట్టింగ్స్ తో సహా మూవ్ చేయవచ్చా?
-క్రిష్ణ , నెల్లూరు

క్రిష్ణ గారు మమోలు పరిస్తితిలో అయితే కొన్ని సాఫ్ట్ వేర్స్ కి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది కాని చాలా వరకు సాఫ్ట్ వేర్స్ ఈ విధానాన్ని సపోర్ట్ చేయవు.  కాని కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగిస్తే మీరు అనుకున్నట్టు ఉపయోగించగలుగుతారు.  దీనిలో PickMeApp అనే చిన్న ప్రోగ్రాంని ఉపయోగించి మీరు అనుకున్నట్టు సాఫ్ట్ వేర్ ఏ కంప్యూటర్ లో నైన ఉపయోగించ గలుగుతారు కొన్ని పరిమితులకి లోబడి.  http://www.pickmeapp.com/download     అనే వెబ్ సైట్  నుండి ఈ ప్రోగ్రాం ని డౌన్ లోడ్ చేసుకుని రన్ చేసిన వెంటనే
ఫై చిత్రంలోని విధంగా స్క్రీన్ వస్తుంది, ఇందులో కుడి చేతి వైపున మీ కంప్యూటర్ లో ఇప్పటికే ఇన్ స్టాల్ అయి ఉన్న ప్రోగ్రాంలు కనిపిస్తాయి.  వాటిలో మీరు కాపీ చేయాలి అనుకున్న ప్రోగ్రామ్స్ ని ఎంచుకుని Capture Marked applications అనే బటన్ ని ప్రెస్ చేస్తే అవి .tap ఫైలుగా బ్యాకప్  తియబడతాయి.  ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఇదే ప్రోగ్రాం ఉపయోగించి మళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

MS-Word లో లింకులు హైపర్ లింక్ లుగా మారటం లేదు.

నేను వర్డ్ లో ఏదయినా డాక్యుమెంట్ ని తయారుచేసినపుడు నా అవసరం కొద్ది కొన్ని వెబ్ సైట్ లింక్ లు అందులో టైపు చేస్తూ ఉంటాను.  అయితే అవి హైపెర్ లింక్ గా మాత్రం మారటం లేదు.
-మాధవరావు, వరంగల్
సాధారణం గా ఎలాంటి ప్రయత్నం లేకుండానే వర్డ్ లో కాని ఎక్సెల్ లో కాని ఏదయినా వెబ్ సైట్ పేరు టైపు చేసినపుడు ఆటోమేటిక్ గా అది హైపెర్ లింక్ గా మారటం జరుగుతుంది.  అయిన కాని జరగటం లేదు అంటే మాన్యువల్ గా మేరు లింక్ ఇవ్వండి.  ఏదయితే వర్డ్ కి హైపెర్ లింక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పదాన్ని సెలెక్ట్ చేసి Ctrl+K  అని కొడితే ఈ విండో లో మాదిరిగా వచ్చే బాక్స్ లో Address దగ్గర ఆ వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది.

Yahoo Update అనే ప్రోగ్రామ్ ఎల్లపుడు రన్ అవుతుంది.

Task manager  ద్వారా ఈ మద్య నేను రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ చుస్తే Yahoo AU Service.exe అనే ప్రోగ్రాం ఎల్లపుడు రన్ అవుతుంది, దీన్ని తొలగించడం ఎలా
-మోహన్, తాడేపల్లిగూడెం
మీ కంప్యూటర్ లో యాహూ మేస్సేన్గేర్   ఉంటే ఈ సర్వీసు నిరంతరం రన్ అవుతూ ఉంటుంది.  ఇదే ప్రతీ నెట్ కి కాంనేక్ట్ అయి యాహూ మేస్సంజర్ కొత్త వెర్షన్ వచ్చిందేమో అని చెక్ చేస్తుంది.  ఇది మీ కంప్యూటర్ లో మెమరీ ని వృధా చేయడం తప్ప దీని వల్ల మీకు ఈ ఉపయోగం ఉండదు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా తీసి వేయవచ్చు.  అది ఎలా అంటే ముందుగా టాస్క్ మేనేజర్ లో Yahoo AU Service.exe  అనే ప్రాసెస్ ని రైట్ క్లిక్ చేసి End Process చేయండి.  ఇప్పుడు C:\ProgramFiles\Yahoo!\SoftwareUpdate అనే విభాగం లోకి వెళ్లి Uninst_AutoUpadater అనే ప్రోగ్రాం ని రన్ చేస్తే Uninstall స్క్రీన్ వచ్చి అది పూర్తిగా తొలగిపోతుంది.

Turbo C++ విండోస్ 7 లో పనిచేయటంలేదు

నేను ఈ మద్య విండోస్ 7  నా కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేశాను కాని ఇప్పుడు నేను C,C++ లాంగ్వేజ్ లను నా కంప్యూటర్ లో రన్ చేయలేక పోతున్నాను దాని వల్ల మళ్ళి విండోస్ XP నే ఇన్ స్టాల్ చేద్దామను కుంటున్నాను ఈ ప్రాబ్లం ని ఎలా అధిగమించాలో సహాయం చేయండి.
-హారిక,  కాకినాడ
హారిక గారు మీరు నేను ఇచ్చిన ఈ లింక్   http://goo.gl/vbslh నుండి Turbo C++ ఎడిటర్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి.  ఇన్స్టాల్ చేసిన వెంటనే మీ డెస్క్ టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది ఇక నుండి ఆ ఐకాన్ క్లిక్ చేయగానే ఎడిటర్ ఓపెన్ అవతుంది.  

ప్రింటర్ ఇంక్ Cartridge Dry అవకుండా చేయడం ఎలా

నా దగ్గర HP 2050 ప్రింటర్ ఉంది కాని నేను దాని చాల తక్కువ సార్లు మాత్రమే ఉపయోగిస్తాను.  దాని వల్ల Cartridge Dry అయి పోతుంది నిజంగా నాకు అవసరం ఉన్న సమయం లో అది పని చేయటంలేదు అలా కావద్దు అంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
-S.K. రాజా ద్రాక్షారామం
మీరు కనీసం వారానికి ఒక సారి అయిన కొద్ది మొత్తంలో plain text తో కూడిన పేజిని గాని Printer Test Page Option ద్వారా టెస్ట్ పేజిని గాని ప్రింట్ చేసుకోవాలి, లేదంటే ఇంక్ జెట్ ప్రింటర్ లోని Cartridge చాల త్వరగా Dry అయిపోతుంది.  ఒక వేళ నెలల తరబడి మీరు ప్రింటర్ని వాడె అవసరం ఏర్పడకపోతే ప్రింటర్ నుండి Cartridge వేరు చేసి కొద్ది పాటి తేమతో కూడిన పేపర్ క్లాత్ తో ప్యాక్ చేసి బద్ర పరిస్తే సరిపోతుంది.