Task Manager ని ఎన్ని రకాలుగా
ఓపెన్ చేసుకోవచ్చు
ఏదయినా స్పందించని ప్రోగ్రాంని క్లోజ్ చేయడానికి Task Manager ని ఓపెన్ చేయవలిసి
వస్తే దాదాపు ప్రతీ ఒక్కరు ప్రయత్నిచేది Ctrl+Alt+Del లను ప్రెస్ చేయడమే.
- టాస్క్ బార్ ఫై రైట్ క్లిక్ చేస్తే కింద చిత్రంలోని విధంగా Start TastManager అనే ఆప్షన్ని ఎంపిక చేసుకున్న Task Manager వస్తుంది.
- అలాగే Win+R కీలను ప్రెస్ చేసినపుడు వచ్చే రన్ బాక్స్ లో taskmgr అని టైపు చేయడం ద్వారా కూడా Tast Manager రన్ చేసుకోవచ్చు.
- Ctrl+Shift+Esc కీలను ప్రెస్ చేసినా సరిపోతుంది.
- Windows Explorer/My Computer లో c:\Windows\System32 అనే ఫోల్డర్ లో taskmgr.exe అనే ప్రోగ్రాం ని రన్ చేసినా Tast Manager వస్తుంది.
- ఇంకా సులబంగా కావాలి అంటే డెస్క టాప్ ఫై Shortcut Create చేసుకోండి. Taskmgr.exe ఫైల్ ఓపెన్ అయి ఉండగా ఆ ఫైల్ ఫై రైట్ క్లిక్ చేసి Send To>Desktop(Create Shortcut) అనే ఆప్షన్ ఎంచుకుంటే ఇకపై Task manager కోసం Desktop శాశ్వతంగా Shortcut లబిస్తుంది.
టైం గడువు ముగిసిన ప్రోగ్రాంలు రన్ చేయడానికి
అనేక ప్రోగ్రాం లు Trial వెర్షన్ 15,30 రోజులు గడువిని మాత్రమే కలిగి ఉంటాయి. ఆ గడువు ముగియగానే ఆ సాఫ్ట్ వేర్ కొనవసిందే. అయితే ఎలా టైం పరిమితి కలిగిన ప్రోగ్రాంలు
గడువిని పెంచుకోవడానికి http://goo.gl/NLNDB అనే లింక్ లో లబించే
RunAsDate అనే ప్రోగ్రాం ఒకటి
పనికొస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని
రన్ చేసిన తరువాత గడువు ముగిసిన .exe ఫైల్ ని ఎంపిక
చేసుకుని
Run అనే బటన్ ఫై క్లిక్ చేస్తే సరిపోతుంది. . కొన్ని ప్రోగ్రాం లు తేదిని ఎలా మార్చిన మరింత
క్లిష్టతరం అయిన అల్గారిథం ఆధారంగా మన కంప్యూటర్ లో ఆ ప్రోగ్రాం ఎపుడు ఇన్ స్టాల్
చేయబడింది అని గుర్తించి పనిచేయడం ఆగిపోతాయి.
వాటికీ ఇది పనికి రాదు.
DVD సినిమాల్ని
MKV ఫార్మాట్ లోకి మార్చేయాల..?
మీ దగ్గర దగ్గర ఉన్న DVD డిస్క్ లోని వీడియోలు
తక్కువ స్థలం ఆక్రమించే .MKV ఫార్మటు లోనికి మార్చుకోవాలి అంటే makemkv (http://makemkv.com) అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి
సులభం గా మార్చు కోవచ్చు. దీన్ని రన్ చేసాక మీ దగ్గర ఉన్న DVD ని డ్రైవ్ లో
పెట్టి చాప్టర్లు, సబ్-టైటిల్స్ వంటి వాటిలో ఏమమేం కావాలో ఎంచుకుని, Output ఫోల్డర్
ని సెలెక్ట్ చేసుకుని MakeMKV అనే బటన్ క్లిక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. DVD యొక్క సైజు ని బట్టి కన్వేర్సన్ టైం
పడుతుంది.
Pen Drive Eject చేసాక మల్లి ఎందుకు insert చేయాలి...?
Pendrive కాని External Harddisk కాని ఒక సారి Eject చేసిన తరువాత మళ్ళి వాడాలంటే వాటిని సిస్టం నుండి unplug చేసి మళ్ళి insert చేస్తేనే గాని మళ్ళి దాన్ని ఉపయోగించలేము. దీనికి కారణం ఏమిటి అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న USB 1.0 లేక USB 2.0 Version లలో ఏవి కూడా కంప్యూటర్ కి దానంతట అవి కమ్యుని కేట్ కాలేవు. USB Device Insert చేసినా తరువాత ఆపరేటింగ్ సిస్టం గుర్తించి అవసరాన్నిబట్టి వాటి అంతట అవి పని చేయడం ప్రారంభిస్తాయి. కాని ఒకసారి Eject చేసిన తరువాత దానిని భౌతికంగా Unplug చేయకపోయినా ఆపరేటింగ్ సిస్టం దృష్టిలో మాత్రం అది అందుబాటులో లేనట్లే. కాని ప్రస్తుంతం వచ్చిన USB 3.0 Version లో Device లు వాటంతట అవి కమ్యుని కేట్ చేయగలవు కాబట్టి Eject చేసినా ప్రతీ సారి తిరిగి Insert చేయలిసిన అవసరం లేదు.
హార్డ్ డిస్క్ లోని ఒక Partition దాచడం ఎలా?
మన కంప్యూటర్ లో ఉన్న డేటా నీ దాచడానికి (Files, Folders) చాలా రకాల మార్గాలు ఉన్నాయి విండోస్ లో Default గా ఉండే Hide Files & Folders దగ్గర నుండి అనేక రకాలు అయిన యుటిలిటీస్ వచ్చాయి. అందులో కొన్ని యుటిలిటీస్ ఉపయోగించి మొత్తం ఒక
డ్రైవ్ నే దాచవచ్చు. కాని ఏ యుటిలిటీస్
ఉపయోగించకుండా కంప్యూటర్ లో డ్రైవ్ నీ మొత్తం కనపడకుండా దాచిపెట్టవచ్చు.
Start>Run>diskmgmt.msc
అని టైపు చేస్తే Disk management విండో ఓపెన్ అవతుంది.
ఇపుడు ఏ డ్రైవ్ నీ అయితే దాచిపెట్టాలని అనుకుంటూ నారో
ఆ డ్రైవ్ నీ ఎంపిక చేసికుని ఆ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేస్తే ఈ క్రింది చిత్రం లో
లాగ ఒక మెను ఓపెన్ అవుతుంది దానిలో Change
Drive letter మీద క్లిక్ చేయండి.
ఇపుడు ఒక బాక్స్ ఓపెన్ అవతుంది. అందులో Drive
letter నీ ఎంచుకుని Remove అనే బటన్ కొట్టండి.
ఒక వార్నింగ్ చూపించబడుతుంది Yes కొడితే ఇక ఆ డ్రైవ్ My Computer లో కన్పించదు.
తిరిగి ఆ డ్రైవ్ అవసరం
అనుకుంటే ఇదే పద్దతిని అనుసరించి ఆ Partition కి డ్రైవ్ లెటర్ సెట్ చేస్తే సరిపోతుంది.
గమనిక: ఈ పద్దతిలో C Drive లెటర్ మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.





