Trouble Shooting

డ్రైవర్స్ బ్యాక్ అప్ తీయడం ఎలా?

సిస్టం డ్రైవర్స్ అనేవి చాలా మంది ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య.  ఎందుకు అంటే ఒక సారి ఇన్స్టాల్ చేసిన తరువాత డ్రైవర్స్ ఏ కారణం చేతనైన ప్రాబ్లం వస్తే లేక అనుకోకుండా సిస్టం క్రాష్ అయినపుడు ఫార్మటు చేయవలిసి వస్తే మల్లి మన అన్ని Devices పని చేయాలి అంటే ఈ డ్రైవర్స్ అవసరం ఉంటుంది.  కాని అందరి దగ్గర ఈ డ్రైవర్స్ అందుబాటులో లేనపుడు ఏమి చేయాలి అనేది ప్రధాన సమస్య.  అసలు డ్రైవర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? కంప్యూటర్  కి అంటే హార్డువేర్ డివైస్ కి మరియు యుసర్ కి మద్య అనుసందాన కర్తగా ఉండేదే ఈ డ్రైవర్స్.  మరి ఆ పని చేయడానికి ఆపరేటింగ్ సిస్టం ఉంది కదా అనే చాలా మందికి అనుమానం రావచ్చు.  కరెక్టే కానీ ఆపరేటింగ్ సిస్టం దగ్గర అన్ని డివైస్ లుకు సంబదించిన ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేనపుడు ఆ ఇన్ఫర్మేషన్ నీ డ్రైవర్స్ అనే చిన్న ప్రోగ్రాం ద్వార ఆపరేటింగ్ సిస్టం కి అర్ధమయ్యేలా చేయడమే ఈ డ్రైవర్స్ యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇంత ప్రధాన మయిన డ్రైవర్స్ CD మనదగ్గర లేనపుడు ఏమి చేయాలి?  

  •        ఇంటర్నెట్ నుండి మనకు కావలిసిన డ్రైవర్స్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయడం. 
  •        మన డ్రైవర్స్ ముందే బ్యాక్ అప్ తీసుకోవడం కాని ఆ బ్యాక్ అప్ తెసుకోవడం ఎలా అనేది ప్రధాన సమస్య.  మనకు అనేక డ్రైవర్ బ్యాక్ అప్ టూల్స్ అనేకం అందుబాటులో ఉన్నాయి.  దానిలో ఒక్కొక్క టూల్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ రోజు మనం DriverMax అనే టూల్స్ కోసం తెలుసు కుందాం. 
ఈ టూల్ ఉపయోగించి డ్రైవర్స్ ని బ్యాక్ అప్ తీయడం, రిస్టోర్ చేసుకోవడం మరియు మన డ్రైవర్స్ యొక్క Updates ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎంత గానో ఉపయోగ పడుతుంది ప్రస్తుతానికి ఇది ఫ్రీ టూల్ గా లభ్యమవుతుంది. 
ఇన్స్టాల్ చేసుకున్న తరువాత రెడ్ కలర్ లో ఉన్న మెను మెడ క్లిక్ చేస్తే ఒక మెను ఓపెన్ అవతుంది అది మీరు ఏ స్క్రీన్ లో చూడొచ్చు.

Backup Drivers మీద క్లిక్ చేయండి.

ఇపుడు మీ సిస్టం లో ఇన్స్టాల్ చేయబడి ఉన్న డ్రైవర్స్ లిస్టు కనిపిస్తుంది.  ఏ డ్రైవర్స్ అయితే బ్యాక్  అప్ తీయాలని అనుకుంటూ నారో అ డ్రైవర్ సెలెక్ట్ చేసి కింద కనిపిస్తున్న backup బటన్ మెడ క్లిక్ చేయండి.
          
ఇపుడు ఇలా ఒక మెను ఓపెన్ అవతుంది.  Backup selected drivers మెడ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న డ్రైవర్స్ యొక్క బ్యాక్ అప్ కాపీ Drivermax  యొక్క default ఫోల్డర్ లోకి కాపీ చేయడం జరుగుతుంది. 
Backup all Drivers క్లిక్ చేస్తే మీ సిస్టం లో ఉన్న డ్రైవర్స్ లిస్టు అంత Default ఫోల్డర్ లోకి కాపీ చేయబడుతుంది.
Backup Selected drivers to a specified folder క్లిక్ చేస్తే మీరు కోరుకున్న లొకేషన్ లో బ్యాక్ అప్ కాపీ Create చేసుకోవచ్చు.

ఫైల్ నేమ్ ఇచ్చి save బటన్ క్లిక్ చేయండి.
                                                           

బ్యాక్ అప్ ప్రాసెస్ జరుగుతుంది.
                   
బ్యాక్ అప్ complete అయిన తరవాత ఎలా explorer విండోస్ ఓపెన్ అవతుంది. ఇపుడు డ్రైవర్స్ బ్యాక్ అప్ Complete అయినట్టే. ఈ ఫోల్డర్ ని ఎదయిని CD లోకి కాపీ చేసుకుని ఇపుడు అయిన ఉపయోగించు కోవచ్చు.
ఇపుడు బ్యాక్ అప్ తీసిన డ్రైవర్స్ Restore చేయడం ఎలాగో చూద్దాం.

Restore Drivers from backup ఫై క్లిక్ చేయండి.

ఇపుడు Load అనే బటన్ ఫై క్లిక్ చేయండి.
ఒక ఓపెన్ Dialog Box ఓపెన్ అవతుంది ఇపుడు బ్యాక్ అప్ సోర్స్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి.

ఆ ఫోల్డర్ లో ఈ డ్రైవర్స్ అయితే ఉన్నాయో ఆ లిస్టు డిస్ప్లే అవతుంది.  మనకు కావలిసిన డ్రైవర్ సెలక్ట్  చేసుకుని Resore క్లిక్  చేయాలి.
                        
ఈ ప్రాసెస్ కంప్లేట్ అయిన తరువాత సిస్టం restart అడుగుతుంది Restart అయిన తరువాత డ్రైవర్స్ installation పూర్తి అయినట్టే. 
ఎంతో కష్టం అనుకున్న డ్రైవర్స్ ప్రొబ్లెంస్ ఇలా చిన్న టూల్ ఉపయోగించి చాల సులువుగా మన ప్రాబ్లం ని అధిగమించవచ్చు.  ఇలాటి టూల్స్ ఇంటర్నెట్ లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ లో వేరే టూల్స్ కోసం నేర్చుకుందాం.  ఇంకా మీకు ఏమయినా Doubts ఉన్నట్లేయితే మాకు మెయిల్ చేయండి.